Ranji Trophy 2024: దేశవాళీ క్రికెట్లో విదర్భ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆదిత్య సర్వతె అరుదైన ఘనత సాధించాడు. గుజరాత్‌లోని వల్లభ్ విద్యానగర్ వేదికగా మణిపూర్‌లో జరిగిన రంజీ మ్యాచ్‌లో సర్వతె తన బౌలింగ్ మాయతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు వేసిన ఆదిత్య.. ఏకంగా 53 డాట్ బంతులు వేయడం విశేషం. ఆదిత్య బౌలింగ్‌లో ఒక్క బంతికి మాత్రమే మణిపూర్ బ్యాటర్లు పరుగు తీయగలిగారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఆదిత్య విజృంభించడంతో ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసి విదర్భ ఘన విజయాన్ని అందుకుంది.
నిన్న మొదలైన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మణిపూర్.. తొలి ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది. బికాష్ సింగ్ (13) హయ్యస్ట్ స్కోరర్. విదర్భ బౌలర్లలో ఆదిత్య 9 ఓవర్లు బౌలింగ్ చేసి 8 మెయిడిన్లు చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బికాష్ సింగే ఆదిత్య బౌలింగ్‌లో సిక్సర్ కొట్టాడు. ఇక విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 80.3 ఓవర్లలో 230 పరుగులుకు ఆలౌట్ అయింది. బౌలింగ్‌లో రాణించిన ఆదిత్య.. బ్యాటింగ్‌లో కూడా 69 పరుగులు చేశాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మణిపూర్.. 32 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆదిత్య.. 11 ఓవర్లు బౌలింగ్ చేసి ఆరు మెయిడిన్లు చేసి పది పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో కూడా అతడు ఐదు వికెట్లు తీశాడు. ఫలితంగా విదర్భ.. 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.