Amit Mishra : భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా(Amit Mishra) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఒకానొక దశలో తన స్పిన్ మ్యాజిక్‌తో టీమిండియా ప్రధాన అస్త్రంగా మారిన మిశ్రా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించాడు. 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు మంగళం పాడుతున్నట్టు గురువారం ప్రకటించాడీ స్పిన్ దిగ్గజం. అయితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్, దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగుతానని 42 ఏళ్ల మిశ్రా తెలిపాడు.
‘అంతర్జాతీయ క్రికెట్లో 25 ఏళ్ల అనుభవం కలిగిన నేను ఈరోజుతో వీడ్కోలు పలకుతున్నాను. నా మొదటి ప్రేమ, తొలి గురువు, నాకెంతో సంతోషాన్నిచ్చే ఆటకు రిటైర్మెంట్ చెబుతున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలు, గర్వపడిన క్షణాలు, బాధపడిన సందర్భాలు, నేర్చుకున్న విషయాలు చాలానే ఉన్నాయి. నాకు అవకాశం కల్పించినందుకు బీసీసీఐకి, హర్యానా క్రికెట్‌కు ధన్యవాదాలు. నాకు ప్రతి అడుగులో ఎంతగానో సహకరించిన కోచ్‌లు, సహాయక సిబ్బంది.. మరీ ముఖ్యంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని మిశ్రా పేర్కొన్నాడు.
Today, after 25 years, I announce my retirement from cricket — a game that has been my first love, my teacher, and my greatest source of joy.
This journey has been filled with countless emotions — moments of pride, hardship, learning, and love. I am deeply grateful to the BCCI,… pic.twitter.com/ouEzjU8cnp
— Amit Mishra (@MishiAmit) September 4, 2025
దేశవాళీలో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో పడిన మిశ్రా 2003లో తొలి వన్డే ఆడాడు. అయితే.. .. 2017లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ త ర్వాత నుంచి అవకాశాల కోసం ఎదురుచూసినా సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదు. దాంతో.. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో కనిపిస్తున్న మిశ్రా ఇక రిటైర్మెంట్ సమయం వచ్చేసిందని భావించాడు.
🚨 Amit Mishra has retired from all forms of cricket
He ends his career with 68 international appearances and 162 IPL appearances 🧢
He is also the only player to take three IPL hat-tricks #retirement pic.twitter.com/pouk8SNFhf
— Cricbuzz (@cricbuzz) September 4, 2025
సినీయర్లు అశ్విన్, ఛతేశ్వర్ పూజారాలు అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకున్నందున తాను కూడా అల్విదా చెప్పాలని నిర్ణయించుకున్నాడు.భారత జట్టు తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడాడీ లెగ్ స్పిన్నర్. మూడు ఫార్మాట్లలో కలిపి 156 వికెట్లు పడగొట్టాడు. 2008లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన మిశ్రా తొలి మ్యాచ్‌లోపే 5 వికెట్లతో మెరిశాడు.
ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీ ప్రధాన స్పిన్నర్లలో మిశ్రా ఒకడు. ఏకంగా మూడు హ్యాట్రిక్స్‌తో చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున 2008లో, దక్కన్ ఛార్జర్స్ ప్లేయర్‌గా 2011లో, సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఆటగాడిగా 2013లో హ్యాట్రిక్ తీశాడు మిశ్రా. మిస్టరీ బౌలర్‌గా ముద్ర పడిన అతడు162 మ్యాచుల్లో 174 వికెట్లు తీసి అరదహో అనిపించాడు.17వ సీజన్లో ఈ మిస్టరీ స్పిన్నర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.