Venezuela Earthquakes: 250 బిల్డింగ్లు నేలమట్టం.. 235కు చేరిన మృతుల సంఖ్య
Venezuela Earthquakes: వెనిజువెలా భూకంపంలో సుమారు 250 బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. జంట భూకంపాల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 235కు చేరుకున్నది. సుమారు 4300 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
కారకాస్: వెనిజువెలా శిథిలాల దిబ్బగా మారింది. బుధవారం సాయంత్రం సంభవించిన జంట భూకంపాల(Venezuela Earthquakes) వల్ల ఆ దేశంలో మృతిచెందిన వారి సంఖ్య 235కు చేరుకున్నది. ఇక గాయపడ్డవారి సంఖ్య 4300 దాటింది. కారకాస్‌కు సమీపంలో ఉన్న కోస్టల్ నగరం లా గైరాలో ఇంకా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. అనేక బిల్డింగ్లు నేలమట్టం కావడం వల్ల వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. కొన్ని బిల్డింగ్‌లకు భద్రత కరువైంది. రెండు రోజులుగా జనం రోడ్డుపైనే నిద్ర పోయారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. వెనిజువెలాకు సహాయం అందించేందుకు అనేక దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అమెరికా నౌకలను, విమానాలను పంపిస్తున్నది. లా గైరా సిటీలో సుమారు 250 బిల్డింగ్లు నేలమట్టం అయినట్లు జార్జ్ రోడ్రిగ్రేజ్ తెలిపారు. ఓ పది అంతస్తుల హోటల్ పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే.
A security camera in #Venezuela captured the exact moment an #earthquake caused cracks to begin forming in a building, as dozens of people desperately tried to escape to safety. These are the kinds of images that shook the world. 🇻🇪🙏#Earthquake #Disaster#Venezuela pic.twitter.com/pdO4viy6zR
— Ronny (@FreePalesten) June 26, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

