న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక డెఫ్లింపిక్స్లో భారత్కు మరో పతకం దక్కింది. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న టోర్నీలో భారత యువ షూటర్ వేదిక శర్మ కాంస్యం కొల్లగొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో వేదిక 207.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకం చేజిక్కించుకుంది.
ఇన్నా అఫోన్చెంకో (ఉక్రెయిన్) 236.3 పాయింట్లతో స్వర్ణం, యాజు (చైనీస్ తైపీ) 232 పాయింట్లతో రజతం సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ స్వర్ణంతో చరిత్ర సృష్టించగా.. శౌర్య సైనీ కాంస్యంతో మెరిశాడు.