సైప్రస్ : ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం జరిగిన తొమ్మిదో రౌండ్ పోరులో వైశాలి 1-0 తేడాతో భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ దివ్యాదేశ్ముఖ్పై విజయం సాధించింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో వైశాలిదే పైచేయి అయ్యింది. ఈ విజయంతో తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి వైశాలి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది.
వైశాలితో పాటు జు జినర్(చైనా) సంయుక్తంగా టాప్‌లో ఉంది. మరోవైపు ఓపెన్ విభాగంలో వీ యి(చైనా)తో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ఆర్ ప్రజ్ఞానంద డ్రాగా ముగించుకున్నాడు. విజయం కోసం ఇరువురు ప్లేయర్లు కడదాకా హోరాహోరీగా పోరాడారు. ప్రజ్ఞానంద 3.5 పాయింట్లతో కొనసాగుతుండగా, జావోకిర్ సింద్రోవ్ 6.5 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు.