Vaibhav Suryavanshi | జైపూర్: రాజస్థాన్ రాయల్స్ చిన్నోడు, ఐపీఎల్లో రికార్డు శతకంతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ప్రశంసల జడివానలో తడిసి ముద్దవుతున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్ ఆటకు భారత క్రికెటర్లతో పాటు ప్రముఖ ఎఫ్1 రేసర్ ఆస్కార్ పియాస్ట్రి (ఆస్ట్రేలియా) సైతం ముగ్ధుడయ్యాడు.
తాజాగా ఈ మెక్లారెన్ డ్రైవర్ తన ఇన్‌స్టా రీల్స్‌లో.. వైభవ్ ఫొటోతో కూడిన రీల్‌ను షేర్ చేశాడు. ఈ రీల్‌కు అతడి వయసును సూచించేలా ‘14’ అని రాసి పక్కనే క్లాప్స్ కొడుతున్న ఎమోజీని ఉంచాడు. క్రికెట్ అభిమాని అయిన పియాస్ట్రి.. గతంలో పలుమార్లు తనకు ఈ ఆట, ఆటగాళ్లపై ఉన్న అభిమానాన్ని బహిరంగంగానే వెల్లడించిన విషయం తెలిసిందే.