ముంబై: వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) భారీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. టీ20ల్లో వ్యక్తిగతంగా 200 పరుగులు సాధించాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాన్ని చెప్పాడు. ఐపీఎల్ 2026లో సెన్షేన్ క్రియేట్ చేస్తున్న వైభవ్.. అసాధారణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్లో దాదాపు ప్రతి బౌలర్‌ను వైభవ్ చితకబాదాడు. ఇక టీ20 క్రికెట్ ఫార్మాట్లో డబుల్ సెంచరీ కొట్టిన తొలి బ్యాటర్ కావాలనుకుంటున్నట్లు చెప్పాడు.
టీ20 క్రికెట్లో ఇప్పటి వరకు విండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ అత్యధికంగా 175 రన్స్ చేశాడు. ఆర్సీబీ జట్టు తరపున అతను ఆ స్కోర్ చేశాడు. 2013 ఐపీఎల్ సీజన్లో పూణె జట్టుపై ఆ వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును సూర్యవంశీ బద్దలు చేయాలనుకుంటున్నాడు. చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ను టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపాడు. యూట్యూబ్ షో ద స్విచ్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. టీ20 క్రికెట్ మ్యాచ్‌లో 200 రన్స్ స్కోర్ చేయాలని ఉందని సూర్యవంశీ తెలిపాడు.
గేల్ ఖాతాలో 175 రన్స్ ఉన్నాయని, ఆ మైలురాయిని దాటాలని ఉందా అని అడ్డగా, అవును ఆ రికార్డును బ్రేక్ చేయాలని ఉందన్నాడు. టీ20 మ్యాచ్‌లో 200 రన్స్ స్కోరు చేయనున్నట్లు తెలిపాడు.ఏదైనా మ్యాచ్‌లో 20 ఓవర్లు ఆడగలిగితే, అప్పుడు కచ్చితంగా ఆ రికార్డును బద్దలు కొడుతానన్నాడు.
Vaibhav Sooryavanshi Wants To Score 200 Runs In T20! 🤯🔥
Chris Gayle Holds The Record At 175! 😅 pic.twitter.com/liNldqDn0k
— The Switch | Kevin Pietersen (@kptheswitch) May 25, 2026