న్యూఢిల్లీ : టీమిండియా జాతీయ జట్టుకు ఎంపిక కావడం తన కెరీర్లో గొప్ప సందర్భమని, ఆ ఫీలింగ్‌ను చెప్పేందుకు తన వద్ద మాటలు లేవని బ్యాటింగ్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) తెలిపాడు. తన కల నెరవేసినట్లు అతను పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌లకు అతన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జూన్ 26వ తేదీ నుంచి ఆ సిరీస్ జరగనున్నది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీని సూర్యవంశీకి అందించారు.. ఆ ఘటనకు చెందిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. తన క్రికెట్ కెరీర్లో అతిపెద్ద అడుగు వేయబోతున్నట్లు వైభవ్ చెప్పాడు. 15 ఏళ్ల వయసులోనే సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అతను 776 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
తన అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నానని, బ్యాట్ పట్టిన తొలి రోజు నుంచి, క్రికెట్ గ్రౌండ్లో ప్రాక్టీస్‌కు వెళ్లిన క్షణం నుంచి .. ఇప్పుడు తన కల నెరవేరినట్లు వైభవ్ తెలిపాడు. తన జర్నీలో అతిపెద్ద అడుగు పూర్తి అయ్యిందని, ఆ ఫీలింగ్‌ను మాటల్లో వర్ణించలేకపోతున్నట్లు ఓ వీడియోలో వైభవ్ పేర్కొన్నాడు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన టీనేజర్ సూర్యవంశీ తొలిసారి 2025 ఐపీఎల్లో ఆడాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసున్నపుడు అతను గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ చేశాడు. 2025, ఏప్రిల్ 28వ తేదీన అతను ఆ సెంచరీ స్కోర్ చేశాడు.
బెల్ఫాస్ట్లో ఐర్లాండ్‌తో జూన్ 26 లేదా 28వ తేదీన జరగనున్న మ్యాచ్‌లో సూర్యవంశీ అంతర్జాతీయ మ్యాచుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఒకవేళ ఐర్లాండ్ లేదా ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో అతను అరంగేట్రం చేస్తే, అప్పుడు అతి పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు. గతంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆ రికార్డును అతను అధిగమించనున్నాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజులు ఉన్న సమయంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.
టీమిండియా జెర్సీ బాక్స్‌ను సూర్యవంశీ ఓపెన్ చేశాడు. దాంట్లో అతని పేరు మీద టీషర్ట్ ఉన్నది. ఆ టీషర్ట్‌పై 03 నెంబర్ ఉన్నది. ఆ టీషర్ట్‌ను చూసినప్పుడు తనలో తాను నవ్వుకున్నట్లు చెప్పాడు. మనం అనుకోనిది జరిగినప్పుడు ఆ సందర్భంలో ఎలా రియాక్ట్ కావాలో తెలియదని, ఆ విధంగానే తాను ఫీలైనట్లు సూర్యవంశీ పేర్కొన్నాడు.
Ladies & Gentlemen
The moment the nation has been waiting for has arrived!
Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw
— BCCI (@BCCI) June 23, 2026