బెంగుళూరు: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) చరిత్ర సృష్టించాడు. ఈస్ట్ జోన్ తరపున ఆడుతున్న ఆ చిచ్చిరపిడుగు.. అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 57 ఏళ్ల క్రితం నాటి రికార్డును అతను బ్రేక్ చేశాడు. దులీప్ ట్రోఫీ సెమీస్‌లో సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను 42 బంతుల్లో అర్థశతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 92 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ గాయపడటంతో వైభవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే దిలీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే 57 ఏళ్ల క్రితం 1969లో లక్ష్మణ్ సింగ్ 16 ఏళ్ల 23 రోజులకు హాఫ్ సెంచరీ కొట్టాడు. తాజా సమాచారం ప్రకారం ఈస్ట్ జోన్ 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసింది. సెంట్రల్ జోన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 266 రన్స్‌కు ఆలౌటైంది.
100-run stand 🙌
Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran with a solid opening stand so far 🤝
Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/7eVSb3iuPU
— BCCI Domestic (@BCCIdomestic) August 31, 2026