Vaibhav Sooryavanshi : జూనియర్ స్థాయిలో, ఐపీఎల్లో ప్రకంపనలు రేపిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ క్రికెట్లోనూ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో విఫలమైన ఈ కుర్రాడు.. జింబాబ్వే పర్యటనలో తన మార్క్ విధ్వంసంతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో వీరవిహారం చేసిన ఈ చిచ్చరపిడుగు 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు 15 ఏళ్ల వైభవ్. అంతేకాదు అంతర్జాతీయ టీ20ల్లో యాభై కొట్టిన అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడీ క్రికెట్ సంచలనం.
ఐపీఎల్లో వేగవంతమైన శతకంతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఈసారి అంతర్జాతీయ క్రికెట్లో తన ముద్ర వేశాడు. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీతో టీమిండియాను గెలిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు అదే వేదికపై మరో రికార్డు పట్టేశాడు. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జింబాబ్వే బౌలర్ల భరతం పట్టిన వైభవ్ .. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దాంతో, అంతర్జాతీయ టీ20ల్లో మొదటి ఫిఫ్టీ నమోదు చేయడమే కాకుండా.. ఈ ఫీట్ సాధించిన చిన్న వయస్కుడిగా మరో ఘనత సొంతం చేసుకున్నాడు.
Maiden international fifty 👏
Vaibhav Sooryavanshi becomes the youngest batter ever to score a T20I half-century 🫡
Follow the match ▶️ https://t.co/NKa0znQQ3H#TeamIndia | #ZIMvIND pic.twitter.com/aUWiBE9FLz
— BCCI (@BCCI) July 23, 2026
1.వైభవ్ సూర్యవంశీ (భారత్) – 15 ఏళ్ల 118 రోజులు, జింబాబ్వేపై 2026 లో
2.లూయిస్ బ్రూస్(గిబ్రాల్టర్) – 16 ఏళ్ల 56 రోజులు, మాల్టాపై 2021లో
3.కవిన్ చద్దా(ఇండోనేషియా) – 16 ఏళ్ల 76 రోజులు, స్వీడన్‌పై 2026లో
4.అలుసినే తురాయ్(సియెర్రా లియోన్) – 16 ఏళ్ల 89 రోజులు, ఘనాపై, 2023లో
5.తెంజిన్ రబ్గే(భూటాన్) – 16 ఏళ్ల 118 రోజులు, చైనాపై, 2023లో
టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో పిన్న వయసులోనే అర్ధ శతకం బాదిన క్రికెటర్ వైభవే. 1989లో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల, 213 రోజుల వయసులో టెస్టు హాఫ్ సెంచరీతో నెలకొల్పిన రికార్డు బద్ధలైపోయింది.