Usman Khawaja : యాషెస్ సిరీస్(Ashes Series) తొలి టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా బదులిచ్చింది. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించాలనుకున్న ఇంగ్లండ్‌కు ఆశలు అడియాశలయ్యాయి. ఆతిథ్య జట్టుకు కేవలం 7 పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది. అందుకు కారణం ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja). క్రీజులో పాతుకుపోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ సంచలన బ్యాటింగ్‌తో ఆసీస్‌ను ఆదుకున్నాడు. 141 పరుగులతో ఆస్ట్రేలియాను పోటీలో నిలిపాడు. అలాంటిది అతను మూడేళ్ల క్రితమే తన కెరీర్ ముగిసిందని భావించాడట. ఈ విషయాన్ని ఈ ఓపెనర్ తాజాగా వెల్లడించాడు.
‘2019 యాషెస్ సిరీస్ తర్వాత టెస్టు జట్టులో చోటు కోల్పోయాను. దాంతో నా కెరీర్ ముగిసింది అనుకున్నా. కానీ, మళ్లీ జట్టులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకని ఆడుతున్న ప్రతి టెస్టు ఒక బోనస్‌లా అనిపిస్తుంది’ అని ఖవాజా తెలిపాడు.
ఉస్మాన్ ఖవాజా

బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy), ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) విఫలమైన ఖవాజా యాషెస్‌లో సత్తా చాటాడు. తొలి టెస్టులో స్టువార్ట్ బ్రాడ్, అండర్సన్ ధాటికి ఆస్ట్రేలియా ఐదు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఖవాజా మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. 14వ సెంచరీతో జట్టును ఒడ్డున పడేశాడు. అతను 141 పరుగుల వద్ద రాబిన్సన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దాంతో, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
యాషెస్ సిరీస్‌లో ఎనిమిదేళ్ల తర్వాత సెంచరీ కొట్టిన ఆసీస్ ఓపెనర్‌గా ఖవాజా చరిత్ర సృష్టించాడు. 2015లో క్రిస్ రోజర్స్(Chris Rogers) లార్డ్స్ స్టేడియంలో 173 పరుగులు చేశాడు. అంతేకాదు ఎడ్జ్‌బాస్టన్(Edgbaston)లో శతకం బాదిన రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. 1997లో మార్క్ టేలర్(Mark Taylor) 129 రన్స్ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 386 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో, ఇంగ్లండ్‌కు 7 పరుగుల ఆధిక్యం లభించిందంతే.