PAK vs USA : పొట్టి ప్రపంచకప్ తొలి పోరులో పాకిస్థాన్(Pakistan) బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కడుతున్నారు. సొంతగడ్డపై అమెరికా(USA) బౌలర్లు చెలరేగడంతో పాక్ టాపార్డర్ చేతులెత్తేసింది. 26 పరుగులకే మూడు వికెట్లు పడిన వేళ కెప్టెన్ బాబర్ ఆజాం(4) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(1) ఆడుతున్నాడు. పవర్ ప్లేలో పాక్ మూడు వికెట్ల నష్టానికి 30 రన్స్ కొట్టింది.
టాస్ గెలిచిన యూఎస్ఏ సారథి మొనాక్ పటేల్() పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ నమ్మకాన్నిన నిలబెడుతూ తన మొదటి ఓవర్లోనే నేత్రావల్కర్ బ్రేకిచ్చాడు. విధ్వంసక ఓపెనర్ రిజ్వాన్(9)ను బోల్తా కొట్టించాడు. ఆ కాసేపటికే స్పిన్నర్ కెంజిగే ఊరించే బంతితో ఉస్మాన్ ఖాన్(3) వికెట్ సాధించాడు. దూకుడుగా ఆడుతున్న ఫఖర్ జమాన్(11)ను అలీ ఖాన్ వెనక్కి పంపి పాక్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.