Under 19 Mens World Cup 2024: సచిన్, ఉదయ్‌ల శతకాలు.. నేపాల్‌పై భారత కుర్రాళ్ల భారీ స్కోరు..
Under 19 Mens World Cup 2024: అండర్ - 19 వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. సూపర్ సిక్స్ స్టేజ్‌లో రెండో మ్యాచ్ ఆడుతున్న యువ భారత్.. నేపాల్‌తో బ్లూమ్‌ఫాంటైన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో...
Under 19 Mens World Cup 2024: అండర్ – 19 వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. సూపర్ సిక్స్ స్టేజ్‌లో రెండో మ్యాచ్ ఆడుతున్న యువ భారత్.. నేపాల్‌తో బ్లూమ్‌ఫాంటైన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 297 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్ దాస్ (101 బంతుల్లో 116, 11 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఉదయ్ సహరన్ (107 బంతుల్లో 100, 9 ఫోర్లు) శతకాలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఏఈలతో పాటు సూపర్ సిక్స్ దశలో న్యూజిలాండ్‌కు చుక్కలు చూపించిన భారత బౌలర్లు నేపాల్‌ను ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి మరి..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఆరంభంలో తడబడింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (21),అర్షిన్ కులకర్ణి (18)లు తడబడ్డారు. ముషీర్ ఖాన్ (7 నాటౌట్) ను కాదని వన్ డౌన్లో ప్రియాన్షు మోలియా (19)ను పంపితే అతడు రనౌట్ అయ్యాడు. దీంతో భారత్.. 13.6 ఓవర్లలో మూడు కీలక వికెట్లను కోల్పోయి 62 పరుగులు చేసింది.
భారీ భాగస్వామ్యం..
భారత స్కోరు 62-3గా ఉన్న క్రమంలో క్రీజులోకి వచ్చిన సహరన్.. సచిన్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ ఆరంభంలో ఆచితూచి ఆడినా తర్వాత ఝూలు విదిల్చారు. అర్థ సెంచరీల తర్వాత జోరు పెంచిన ఈ జోడీ ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించడంతో పాటు భారత్‌కు భారీ స్కోరును అందజేశారు. 93 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న సచిన్.. ఆఖర్లో ధాటిగా ఆడాడు. 80లలో ఉండగా రెండు ఫోర్లు కొట్టి 90లలోకి చేరిన సహరన్.. 49వ ఓవర్లో రెండో బంతికి శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 215 పరుగులు జోడించారు.
Innings break!
Centuries from Sachin Dhas & Captain Uday Saharan power #TeamIndia to 297/5 👏👏
Stay tuned for the second innings ⏳
Scorecard ▶️ https://t.co/6Vp3LnoN6N#BoysInBlue | #INDvNEP pic.twitter.com/bkOR245hwD
— BCCI (@BCCI) February 2, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

