IND vs SA : టీ20 సిరీస్‌లో వరుసగా 21 మ్యాచుల్లో టాస్ ఓడిన రికార్డును బ్రేక్ చేసిన భారత జట్టు .. మళ్లీ టాస్ గెలిచింది. పంజాబ్‌లోని ముల్లన్పూర్ స్టేడియంలో టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఆడిన 11 మందినే కొనసాగిస్తున్నట్టు సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. కటక్‌లో 74కే కుప్పకూలిన సఫారీ టీమ్ మూడు మార్పులు చేసింది. సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ విజయంతో ఆధిక్యాన్ని పెంచుకోవాలనే పట్టుదలతో ఉంది.
పొట్టి సిరీస్‌లో వరుసగా ఆరు సిరీస్‌లు పట్టేసిన భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాపై పంజా విసురుతోంది. తొలి టీ20లో హార్దిక్ పాండ్యా మెరుపులతో 185 కొట్టిన టీమిండియా.. అనంతరం బౌలర్ల విజృంభణతో ప్రత్యర్ధిని 74కే ఆలౌట్ చేసింది. 101 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ సిరీస్‌లో ముందంజ వేసింది. భారీ ఓటమితో షాక్ తిన్న సఫారీ కెప్టెన్ మర్క్రమ్ రెండో మ్యాచ్‌కు ఏకంగా మూడు మార్పులు చేశాడు. స్టబ్స్, మహరాజ్, ఎంగిడి స్థానంలో రీజా హెండ్రిక్స్, బార్ట్‌మన్, లిండేలను తీసుకున్నాడు.
Here’s a look at #TeamIndia‘s Playing XI for the 2⃣nd T20I 👌
Updates ▶️ https://t.co/japA2CIofo#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/tzcZ8EgyvT
— BCCI (@BCCI) December 11, 2025
భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ఎడెన్ మర్క్రమ్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనొవాన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, లుతో సిపమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జి.