IPL 2025 : రికార్డు ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ వరసగా వికెట్లు కోల్పోతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ జయదేవ్ ఉనాద్కాట్(2-23 ) ధాటికి పవర్ ప్లేలోనే ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత డేంజరస్ ఓపెనర్ సునీల్ నరైన్(9)ను బౌల్డ్ చేసిన ఈ స్పీడ్‌స్టర్.. ఆ తర్వాత అజింక్యా రహానే(15)ను వెనక్కి పంపాడు. దాంతో, కష్టాల్లో పడిన కోల్‌కతాను ఓపెనర్ క్వింటన్ డికాక్(9), ఇంప్యాక్ట్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ (5)లు గట్టెక్కించే ప్రయత్నం చేయగా.. ఇషాన్ మలింగ ఈ జోడీని విడదీసి ప్రత్యర్థి గెలుపు అశలపై నీళ్లు చల్లాడు.
మిడ్‌వికెట్ దిశగా భారీ సిక్స్ కొట్టబోయిన డికాక్ బౌండరీ లైన్ వద్ద అభిమన్ మనోహర్ చేతికిచిక్కాడు. అంతే..61 వద్దే మూడో వికెట్ పడింది. ప్రస్తుతం రఘువంశీతో పాటు రింకూ సింగ్(1) క్రీజులో ఉన్నాడు. 7 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 62-3. ఇంకా విజయానికి 78 బంతుల్లో 217 రన్స్ అవసరం.
#KKR with a solid start in the chase 👊
But Jaydev Unadkat picks two crucial wickets 🧡
KKR finish the powerplay at 59/2.
Updates ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @KKRiders | @SunRisers pic.twitter.com/K7g0TKw9sf
— IndianPremierLeague (@IPL) May 25, 2025