హైదరాబాద్, ఆట ప్రతినిధి: డబ్ల్యూపీసీ తెలంగాణ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఉదయ్‌కిరణ్, అభినయ స్వర్ణ పతకాలతో మెరిశారు. గురువారం జరిగిన పోటీల్లో పురుషుల 120కి. విభాగంలో ఉదయ్..డెడ్‌లిఫ్ట్, బెంచ్‌ప్రెస్‌లో కలిపి 300కిలోల బరువెత్తి టాప్‌లో నిలిచాడు.
డార్విన్నెక్ట్స్ జనరేషన్ స్కూల్ విద్యార్థి అభినయ..52కిలోల కేటగిరీలో పసిడి సొంతం చేసుకుంది. 38కిలోల విభాగంలో ఆక్స్ఫర్డ్స్కూల్కు చెందిన తపస్యరావు అగ్రస్థానంతో స్వర్ణం దక్కించుకుంది. పతక విజేతలను రాష్ట్ర పవర్‌లిఫ్టింగ్ సంఘం అధ్యక్షురాలు రేఖ అభినందించారు. జాతీయ టోర్నీకి ఉదయ్,అభినయ ఎంపికయ్యారు.