INDvPAK | యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ (Under-19 Asia Cup) క్రికెట్ టోర్నమెంట్లో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. గ్రూప్ దశలో భాగంగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో పాకిస్థాన్ అండర్-19 జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ అండర్-19 జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. భారత జట్టు ఇప్పటికే తమ తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. పాక్ జట్టు కూడా మంచి ఫామ్లో ఉంది. ఈ నేపథ్యంలో, రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో భారీ స్కోరు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.