పొంటెవెద్రా: స్పెయిన్‌లోని పొంటెవెద్రాలో జరుగుతున్న అండర్23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా చరిత్ర సృష్టించింది. గ్రీకో రోమన్ క్యాటగిరీలో ఇవాళ ఇండియాకు మరో రెండు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. 97 కేజీల విభాగంలో బ్రెజిల్‌కు చెందిన ఇగర్ ఫెర్నాండో అల్వెస్‌ను నితేశ్ ఓడించాడు. ఆ బౌట్లో ఇండియన్ ప్లేయర్ నితేశ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బ్రెజిల్ ప్రత్యర్థిపై 10-0 తేడాతో నితేశ్ గెలిచాడు.
ఇక 72 కిలోల విభాగంలో జపాన్‌కు చెందిన కొబయాషఙపై వికాశ్ విజయం సాధించి బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. రెజ్లర్ వికాశ్ 6-0 తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. ఇండియా తరపున గ్రీకో రోమన్ కేటగిరీలో సాజన్ తొలి పతకాన్ని అందించాడు. ఉక్రెయిన్‌కు చెందిన దిమిత్రో వాసెట్స్కీని ఓడించి మెడల్‌ను కైవసం చేసుకున్నాడు.
వాస్తవానికి ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియా 30 మంది సభ్యుల బృందాన్ని తయారు చేసింది. కానీ కేవలం 9 మందికి మాత్రమే స్పెయిన్ వీసా ఇప్పించింది. మరో 21 మందికి వీసాను తిరస్కరించారు.