కాచిగూడ: ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన అంతర్జాతీయ అండర్ వాటర్ ఫిన్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన గంధం క్వీన్ విక్టోరియా సత్తాచాటింది. మొత్తం 38 దేశాలకు చెందిన ప్లేయర్లు పోటీపడ్డ టోర్నీలో 200మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చిన విక్టోరియా రెండు రజత పతకాలతో మెరిసింది.
ఇలా రెండు విభాగాల్లో పతకాలు సాధించిన తొలి భారత స్విమ్మర్‌గా విక్టోరియా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈజిప్టు స్విమ్మింగ్ టోర్నీలో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన విక్టోరియాను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.