హైదరాబాద్, ఆట ప్రతినిధి : అరో రియాల్టీ టీ9 చాలెంజ్ టోర్నీలో టూటోరూట్, బంకర్ బస్టర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్ వేదికగా శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో టూటోరూట్ 2.5-1.5తో లావిస్టా క్రూసేడర్స్పై గెలువగా, హోరాహోరీగా సాగిన మరో సెమీస్‌లో బంకర్ బస్టర్స్ ప్లేఆఫ్స్‌లో సెమెట్రిక్ను ఓడించింది. సింగిల్స్‌లో రేయ్ నూరోన్హ (టూటోరూట్).. రామ్(క్రూసేడర్స్)పై గెలువగా, గౌతమ్.. శ్రీనివాసన్ మధ్య పోరు డ్రాగా ముగిసింది. డబుల్స్‌లో ఇరు జట్ల మధ్య పోరు సమమైంది.