హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ సబ్ జూనియర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో టీఎస్ తేజస్ రెండు స్వర్ణాలతో సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మేడ్చల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన తేజస్ బాయ్స్ 100మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్ (56.96సె), 200 మీటర్ల విభాగంలో (2:07.04 ని) విజేతగా నిలిచాడు.
ఈ మెగా టోర్నీలో 54 స్వర్ణ పతకాలు గెలిచిన మేడ్చల్ ఓవరాల్ టీమ్ చాంపియన్గా నిలిచింది. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, ఉమేశ్ ట్రోఫీలు అందజేశారు.