హైదరాబాద్, ఆట ప్రతినిధి: లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ తెలంగాణ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీలో త్రిశూల్ మెహ్రా టైటిల్‌తో మెరిశాడు. సోమవారం జరిగిన బాలుర యూత్ విభాగం ఫైనల్లో త్రిశూల్ 12-10, 7-11, 11-6, 11-7, 9-11, 11-7తేడాతో జతిన్దేవ్పై విజయం సాధించాడు.
బాలుర అండర్-11 ఫైనల్లో హ్రియాన్ 3-1తో శ్రీనిర్రెడ్డిపై గెలువగా, బాలికల తుదిపోరులో రిద్ది తొరో 3-0తో మహిమా కృష్ణపై గెలిచి టైటిళ్లు సొంతం చేసుకున్నారు.