రాయ్‌పూర్ : సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో తెలంగాణ అమ్మాయి త్రిష అదరగొడుతున్నది. ఆంధ్ర జట్టుపై 47 పరుగులతో రాణించిన త్రిష.. ఛత్తీస్‌గఢ్‌లో ఒడిషాతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిసింది. 54 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 72 పరుగులు చేసింది. దాంతో హైదరాబాద్ జట్టు 158/6 రన్స్ కొట్టింది. లక్ష్య ఛేదనలో ఒడిషా 75 పరుగులకే కుప్పకూలడంతో.. హైదరాబాద్ 83 పరుగుల తేడాతో గెలిచింది.