టోక్యో: ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన రెండో భారతీయురాలు. వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వర్ గెలిచిన తొలి భారతీయురాలు. టోక్యోలో ఇండియాకు తొలి మెడల్ సాధించి పెట్టిన 26 ఏళ్ల మీరాబాయ్ చాను సొంతం చేసుకున్న రికార్డులు ఇవి. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ కలిపి 202 కేజీల బరువు ఎత్తిన ఆమె.. రెండోస్థానంలో నిలిచి రజత పతకం గెలిచింది. ఈ విజయం తర్వాత ఆమె ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. అయితే తాను మాత్రం గోల్డ్ కోసం గట్టిగానే ప్రయత్నించానని ఆమె చెబుతోంది.
మెడల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం దేశం ఎన్నో అంచనాలతో నన్ను చూస్తోంది. కాస్త ఆందోళనగా అనిపించినా.. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించాను. దీనికోసం చాలా శ్రమించాను. గోల్డ్ మెడల్ గెలవడానికి గట్టిగానే ప్రయత్నించాను కానీ గెలవలేకపోయాను. కానీ ప్రయత్నమైతే చేశాను. రెండో లిఫ్ట్ చేసినప్పుడే మెడల్ గెలుస్తానని తెలిసిపోయింది అని మీరాబాయ్ చెప్పింది. ఆ తర్వాత ట్విటర్ ద్వారా ఆమె దేశవాసులకు కృతజ్ఞతలు తెలిపింది.
I am really happy on winning silver medal in #Tokyo2020 for my country 🇮🇳 pic.twitter.com/gPtdhpA28z
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 24, 2021