Tokyo Olympics: పీవీ సింధు శుభారంభం
పీవీ సింధు| స్టార్ షెట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం పలికింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఇజ్రాయిల్ షట్లర్‌పై ఘన విజయం సాధించింది.

టోక్యో: స్టార్ షెట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం పలికింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఇజ్రాయిల్ షట్లర్‌పై ఘన విజయం సాధించింది. ఇజ్రాయిల్ క్రీడాకారిణి సెనియా పొలికర్పోవ్తో జరిగిన మ్యాచ్‌లో వరుస గేమ్స్‌లో గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత స్టార్ షెట్లర్‌కు పొలికర్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. దీంతో సింధు 21-7, 21-10తో విజయం సాధించింది.
ఒలింపిక్స్ మూడో రోజు షూటర్లు నిరాశ పరిచినప్పట్టికీ రోయింగ్, బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మంచి ఫలితాలు ఎదురయ్యాయి. రోయింగ్‌లో భారత రోయర్లు అరుణ్ లాల్, అర్వింద్ సింగ్ అదరగొట్టారు. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్లో టాప్-3లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ పోటీలు జూలై 27న (మంగళవారం) జరగనున్నాయి.

మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు చుక్కెదురయింది. స్టార్ షూటర్లు మను బాకర్, యశస్విని దేస్వాల్ టాప్-8కు అర్హత సాధించలేకపోయారు. దీంతో పతకం లేకుండానే ఇద్దరు నిష్క్రమించారు. మను బాకర్ 12వ స్థానంలో, యశస్విని 13 స్థానంలో నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

