లండన్ : ఇంగ్లండ్ కౌంటీల్లో భారత యువ బ్యాటర్ తిలక్‌వర్మ దుమ్మురేపుతున్నాడు. కౌంటీల్లో ఆడుతున్నది తొలిసారే అయినా మెండైన ఆత్మవిశ్వాసంతో పరుగుల వరద పారిస్తున్నాడు. నాటింగ్‌హామ్‌షైర్‌తో జరుగుతున్న కౌంటీ పోరులో హాంప్‌షైర్ బ్యాటర్ తిలక్‌వర్మ(112) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ సమయోచిత ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుకు బాటలు వేశాడు.
ఈ క్రమంలో నిక్ గబిన్స్తో 42, బెన్ బ్రౌన్‌తో 58, ఫెలిక్స్ ఆర్గాన్ (122 నాటౌట్)తో 126 పరుగుల విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో నాటింగ్‌హామ్‌షైర్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 578-8(డిక్లేర్డ్)కు సమాధానంగా హంప్‌షైర్ 454 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లాడిన తిలక్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం.