హైదరాబాద్‌లోనే అనుకున్నాం..
న్యూజిలాండ్‌తో రెండో టీ20ఐ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన యువ బ్యాటర్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి మ్యాచ్ అనంతరం తమ అనుభవాలను పంచుకున్నారు. కష్టకాలంలో జట్టును గెలిపించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ‘ఈ విజయం మాకు చాలా ప్రత్యేకం. నిజానికి హైదరాబాద్‌లో ఉన్నప్పుడే మేమిద్దరం ఒక మాట అనుకున్నాం..
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో రెండో టీ20ఐ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన యువ బ్యాటర్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి మ్యాచ్ అనంతరం తమ అనుభవాలను పంచుకున్నారు. కష్టకాలంలో జట్టును గెలిపించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ‘ఈ విజయం మాకు చాలా ప్రత్యేకం. నిజానికి హైదరాబాద్‌లో ఉన్నప్పుడే మేమిద్దరం ఒక మాట అనుకున్నాం.. ఒకవేళ క్లిష్ట పరిస్థితి వస్తే ఇద్దరం తెలుగు కుర్రాళ్లం క్రీజులో ఉండి మ్యాచ్‌ను గెలిపించాలకున్నాం. కానీ, నేను ఎప్పుడూ నమ్మేది ఒక్కటే.. భగవంతుడికి మన కోసం ఎప్పుడు ఏం చేయాలో సరైన సమయమే తేలుస్తుంది.
మనం చేయాల్సిందల్లా ప్రక్రియను నమ్ముతూ కష్టపడటమే.. సరైన సమయం వచ్చినప్పుడు ఫలితాలు వాటంతట అవే వస్తాయి‘ అని పేర్కొన్నాడు. ఇక, తిలక్‌తో కలిసి బ్యాటింగ్ చేయ డం ఎంతో ఆనందాన్నిచ్చిందని నితీశ్ అన్నాడు. ‘మేమిద్దరం మంచి రన్-రన్నర్స్ కావడంతో సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును నడిపించాం. నమన్ దూకుడుగా ఆడుతున్నప్పుడు తిలక్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అతనికి అండగా నిలిచాడు. ఆ తర్వాత మా జంట చేసిన భాగస్వామ్యం జట్టును విజయతీరాలకు చేర్చింది’ అని చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

