డంబుల్లా: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్(India A vs Afghanistan A)లో.. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఇండియా భారీ స్కోరు చేసింది. అయితే ఓపెనర్ సూర్యవంశీ ఇవాళ కూడా విఫలమయ్యాడు. భారీ స్కోరు చేయలేకపోయాడు. అతను వ్యక్తిగతంగా 38 రన్స్ చేసి క్యాచ్ అవుటయ్యాడు. అయితే భారత బ్యాటర్లలో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా, కెప్టెన్ తిలక్ వర్మ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రలు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
తిలక్ వర్మ 59, కుషాగ్రా 58, ఆర్యా 58 రన్స్ చేయడంతో భారత ఏ జట్టు స్కోరు 300 దాటింది. అయితే చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్కు ఆర్యా, సూర్యవంశీ మధ్య 75 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. సూర్యవంశీ 28 బంతుల్లో 38 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. నాలుగో వికెట్కు తిలక్, కుషాగ్రా 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. చివరలో విప్రాజ్ నిగమ్ 20 బంతుల్లో 30 రన్స్ స్కోరు చేసి ఇండియా స్కోరు బోర్డును పరుగెత్తించాడు.
Innings Break!
India A put up a strong total of 3️⃣1️⃣9️⃣/9 courtesy of half-centuries from Priyansh Arya, Kumar Kushagra, and Captain Tilak Varma 🙌
Over to the bowlers!
Updates ▶️ https://t.co/Kg9IWt7M5b#TriNationSeries | #INDAvAFGA pic.twitter.com/AAHqAJUP5T
— BCCI (@BCCI) June 17, 2026