Hockey Medal: ఈ మెడల్ కొవిడ్ యోధులకు అంకితం: కెప్టెన్ మన్‌ప్రీత్
ఒలింపిక్స్‌లో మన మెన్స్ హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన మన్‌ప్రీత్ సేన.. మరోసారి జాతీయ క్రీడను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. జర్మనీపై 5-4తో గెలిచి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయంపై కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ స్పందించాడు.

టోక్యో: ఒలింపిక్స్‌లో మన మెన్స్ హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన మన్‌ప్రీత్ సేన.. మరోసారి జాతీయ క్రీడను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. జర్మనీపై 5-4తో గెలిచి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయంపై కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ స్పందించాడు. ఇండియాలోని కొవిడ్ యోధులకు ఈ మెడల్( Hockey Medal )ను అంకితమిస్తున్నట్లు చెప్పాడు. ఈ చారిత్రక విజయం సాధించిన తర్వాత టీమంతా భావోద్వేగానికి గురైంది. మ్యాచ్ ముగియగానే కెప్టెన్ మన్‌ప్రీత్ సహా టీమ్ అంతా ఆనందం పట్టలేక కంటతడి పెట్టింది.
ఈ కీలకమైన మ్యాచ్‌లో ఇండియా తరఫున సిమ్రన్‌జీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ తలా ఒక గోల్ చేశారు. ఒలింపిక్స్ హాకీలో రికార్డు స్థాయిలో 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన టీమిండియాకు ఇది మూడో బ్రాంజ్ మెడల్. ఇంతకుముందు 1968, 1972 ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

