Sunil Gavaskar : భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వంద శతకాలు సాధిస్తాడని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. అందులో అనుమానమే లేదు. కోహ్లీ వంద అంతర్జాతీయ సెంచరీలు కొడతాడని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లీ మరో 26 శతకాలు బాది సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును సమం చేస్తాడు. ఏడాదికి సగటున 6-7 సెంచరీలు కొడితే అతను సచిన్ రికార్డుకు చేరువవుతాడు’ అని గవాస్కర్ తెలిపాడు. శ్రీలంకతో తిరువనంతపురంలో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో 46వ శతకం నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతనికి 74వ సెంచరీ. ఇదే ఫామ్ కొనసాగిస్తే కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.
నామమాత్రమైన మూడో వన్డేలో ఈ స్టార్ క్రికెటర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్లతో విరుచుకుపడి 166 పరుగులు సాధించాడు. పోయిన ఏడాది ఆసియా కప్‌తో ఫామ్ అందుకున్న అతను పరుగుల వరద పారిస్తున్నాడు. బంగ్లాతో మూడో వన్డేలో సెంచరీ కొట్టిన కోహ్లీ మళ్లీ తన కళాత్మక షాట్లతో ఫ్యాన్స్‌ను అలరించాఉ. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అతడు రెండు శతకాలు బాదాడు. అంతేకాదు స్వదేశంలో అత్యధిక సెంచరీలు (21) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో ఎక్కువ రన్స్ కొట్టిన ఐదో ఆటగాడిగా, శ్రీలంకపై పది సార్లు వందకు పైగా పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.