ముంబై: పరుగులు సాధించాలంటే కొత్త షాట్లు ఆడాల్సిన అవసరం లేదని.. క్రికెట్ పుస్తకాల్లోని షాట్లతో కూడా భారీగా రన్స్ రాబట్టొచ్చని ఐపీఎల్ 15వ సీజన్లో కేఎల్ రాహుల్ నిరూపిస్తున్నాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడని సన్నీ అన్నాడు. ‘తాజా సీజన్లో రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. క్రికెట్ బుక్స్‌లోని అన్నీ షాట్లు ఆడుతున్నాడు. అతడి ఆట తీరు చూస్తుంటే.. పరుగులు రాబట్టేందుకు కొత్త షాట్లు అవసరం లేదని.. బాధ్యతాయుతంగా ఆడుతూ పోతే పరుగులు వాటంతటవే వస్తాయని నిరూపిస్తున్నాడు’ అని గవాస్కర్ అన్నాడు.
అతడు నిజంగా 360 డిగ్రీ ప్లేయర్: కెవిన్ పీటర్స్‌న్
రాహుల్ అమ్ములపొదిలో చాలా అస్ర్తాలు ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్స్‌న్ పేర్కొన్నాడు. ‘ఒకే బంతికి రెండు వేర్వేరు షాట్లు ఆడగలిగే సత్తా రాహుల్‌కు ఉంది. అతడు బ్యాక్ ఫుట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు అవసరమైతే ముందుకొచ్చి ఎదురుదాడి చేయగలడు. అతడు నిజంగా 360 డిగ్రీ ప్లేయర్. టీవీలో రోజంతా అతడి బ్యాటింగ్ చూసినా విసుగు రాదు’ అని పీటర్సన్ అన్నాడు.