విరాట్‌కు రుణపడి ఉంటా
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇటీవలే జపాన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి రుణపడి ఉంటానని తెలిపింది.
- పీవీ సింధు
ఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇటీవలే జపాన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి రుణపడి ఉంటానని తెలిపింది. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు కోహ్లీని సాయం కోరానని, అతడిచ్చిన సలహాలు తనకెంతగానో ఉపయోగపడ్డాయని ఆమె పేర్కొంది. ఎక్స్ వేదికగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు స్పందిస్తూ.. ‘విరాట్ భాయ్‌కు నేనెప్పుడూ రుణపడి ఉంటా.
గాయాలతో సతమతమవుతూ, ఫామ్ కోల్పోయి నా కెరీర్ క్షీణ దశలో ఉన్నప్పుడు నా సమస్యను అర్ధం చేసుకుని సాయం చేసే వ్యక్తి కోసం చూశా. అప్పుడే కోహ్లీని సంప్రదించా. అతడు క్షణాల్లోనే స్పందించాడు. ఆ తర్వాతి రోజే మేం కలుసుకున్నాం. మా ఇద్దరి నడుమ జరిగిన సంభాషణ ఎప్పటికీ మా మధ్యే ఉంటుంది. కానీ ఆ సమయంలో కోహ్లీ చెప్పిన సలహాలు మాత్రం నాకు, నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వాస్తవానికి ఆయన ఎక్కువేం మాట్లాడలేదు. కానీ నాకు, నా భర్తకు చెప్పిన ప్రతి మాట మా మదిలో నిలిచిపోయింది. కొంతమందితో స్నేహం, వారితో సంభాషణ మన ఆలోచణ ధోరణిని మార్చేస్తాయి. అలాంటి వాటిలో ఇదొకటి..’ అని సింధు చెప్పుకొచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

