హైదరాబాద్, ఆట ప్రతినిధి: భిలాయ్(చత్తీస్‌గఢ్) వేదికగా జరిగిన ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన సాయికార్తీక్రెడ్డి ఆకట్టుకున్నాడు. రిషబ్ అగర్వాల్‌తో కలిసి రన్నరప్ ట్రోఫీని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కార్తీక్, రిషబ్ జోడీ 6-7(7/9), 1-6 తేడాతో కలియింద, రిత్విక్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. ఫైనల్ వరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన కార్తీక్, రిషబ్ జంట వరుస సెట్లలో ప్రత్యర్థికి మ్యాచ్‌ను చేజార్చుకుని రన్నరప్‌తో సంతృప్తి పడింది.