చాంగ్వాన్: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత ద్వయం మెహులీ ఘోష్, సాహు తుషార్ ద్వయం పసిడి పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో 17-13 తేడాతో ఎస్జర్ మెస్జరోస్, ఇస్టవెన్ పెన్‌పై అద్భుత విజయం సొంతం చేసుకుంది.
ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్ షూటర్లు వరుసగా మూడు, నాలుగు స్థానాలను సొంతం చేసుకున్నారు. యువ షూటర్ తుషార్‌కు సీనియర్ స్థాయిలో ఇది తొలి పతకం కాగా, మెహులీకి రెండోది. మరోవైపు 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ కాంస్య పోరులో భారత జోడీ పాలక్, శివ నార్వల్ 16-0తో ఇరినా లోక్టినోవా, వలె రక్మిజాన్పై అలవోక విజయం సాధించింది.