చండీగఢ్: భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) అధ్యక్షుడిగా మాజీ అథ్లెట్ బహదూర్ సింగ్ సాగూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా సందీప్ మెహతా, స్టాన్లీ జోన్స్ ట్రెజరర్‌గా నియమితులయ్యారు.
ఈ మేరకు ఇక్కడ జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వారి నియామక ప్రక్రియ పూర్తైంది. సుమరివాలా స్థానాన్ని బహదూర్ భర్తీ చేయనున్నారు.