శంకర్ పల్లి, జూన్ 22: మాన్సూన్ కప్ పోలో చాంపియన్షిప్ 2025 పోటీలు జన్వాడలోని నాసర్ పోలో అండ్ ఈక్వెస్టియ్రన్ అకాడమీలో సోమవారం ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రముఖ జట్లైన రాజస్థాన్ రంబుల్, హర్యానా హరికేన్, తెలంగాణ థండర్.. ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. ప్రతి జట్టు విజయం కోసం తీవ్రంగా కృషి చేసాయి.
ఫైనల్ లో హర్యానా హరికేన్ జట్టు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి తెలంగాణ థండర్ జట్టుపై 2 గోల్స్ తేడాతో విజయం సాధించి మాన్సూన్ కప్ 2025 ను సొంతం చేసుకుంది. సోమవారం ఫైనల్ లో హర్యానా హరికేన్ జట్టు 11 గోల్స్ చేయగా తెలంగాణ థండర్ జట్టు 9 గోల్స్ చేసింది. విజేత జట్టుకు తెలంగాణ-ఆంధ్ర సబ్ ఏరి యా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా ట్రోఫీని అందజేశారు.