హోస్టన్: ప్రపంచ జూనియర్ స్కాష్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్ల పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. ఆదివారం జరిగిన క్వార్టర్స్ పోరులో శౌర్య బవ, అరిహంత్, యువరాజ్‌తో కూడిన భారత పురుషుల జట్టు 1-2తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. మహిళల జట్టు (షమీనా రియాజ్, అన్హంత్, నిరుపమ)ను 1-2తో మలేషియాను ఓడించి సెమీస్‌కు చేరింది.