జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెచ్ఎల్) అరంగేట్రం సీజన్ జైపూర్ వేదికగా జరుగనుంది. జూన్ 8 నుంచి 25వ తేదీ వరకు సవాయ్మాన్సింగ్ ఇండోర్ స్డేడియంలో మ్యాచ్లు జరుగనున్నాయి. లీగ్లో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
ఇందులో రాజస్థాన్ పాట్రియాట్స్, గర్విట్ గుజరాత్, మహారాష్ట్ర ఐరెన్మెన్, గోల్డెన్ ఈగల్స్ ఉత్తర్ప్రదేశ్, తెలుగు టాలన్స్, ఢిల్లీ పంజర్స్ పోటీకి సై అంటున్నాయి. లీగ్ ఏర్పాట్లపై రాజస్థాన్ స్పోర్ట్స్కౌన్సిల్ అధ్యక్షురాలు కృష్ణ పూనియా సంతృప్తి వ్యక్తం చేశారు.