హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ వర్సిటీ వాలీబాల్ లీగ్ క్వాలిఫయర్ పోటీలు హోరాహోరీగా సాగాయి. శనివారం యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్స్‌లో 32 బాలుర, 24 బాలికల జట్లు పోటీపడ్డాయి. ఇందులో గెలిచిన 12 బాలుర, 8 బాలికల జట్లు ప్రధాన పోటీలకు అర్హత సాధించాయి. ఈనెల 22 నుంచి 24 వరకు ఈ స్కూల్ లీగ్ జరుగనుంది. క్వాలిఫయర్స్ ముగింపు వేడుకల్లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ యజమాని అభిషేక్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఒకప్పుడు జాతీయ వాలీబాల్ జట్టులో తెలుగు ప్లేయర్లు ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య చాలా తగ్గింది. పాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులను గుర్తించి జాతీయస్థాయిలో సత్తాచాటే లక్ష్యంతో ఈ లీగ్‌ను మొదలుపెట్టాం. హైదరాబాద్‌కు త్వరలో మీరు ఆడుతారన్న నమ్మకం నాకు కల్గింది’ అని అన్నారు.