హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గురుకులాల ఆధ్వర్యంలో తొలి ఆలిండియా చెస్ టోర్నీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. స్థానిక యూసుఫ్‌గూడ విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న టోర్నీలో సీడెడ్ ప్లేయర్లతో పాటు గురుకుల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి ఇంటర్నేషనల్ మాస్టర్ కృష్ణతేజ, రామకృష్ణ, కార్యశీల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గురువారం జరిగిన వేర్వేరు వయసు విభాగాల్లో కృష్ణతేజ, కౌస్తవ్ కుందు, రామకృష్ణ, సేతుమాధవ్, విశాల్ చౌదరీ, బాసిఖ్ ఇమ్రోజ్, సత్యనారయణ, రామాంజనేయులు, నాగసాయి సార్థక్ ప్రత్యర్థులపై విజయాలతో ముందంజ వేశారు. ఆతిథ్య తెలంగాణ సహా ఏపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఆరు వందల మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు.