సిడ్నీ: ఈనెల 21 నుంచి మొదలుకాబోయే యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాను గాయాలు వేధిస్తున్నాయి. వెన్నుగాయం కారణంగా పెర్త్ టెస్టుకు కెప్టెన్ పాట్ కమిన్స్ దూరమవగా తాజాగా మరో పేసర్ సీన్ అబాట్ కూడా గాయంతో ఫస్ట్ టెస్టుకు దూరమయ్యాడు.
అయితే భారత్‌తో టీ20 సిరీస్ సందర్భంగా తొడ కండరాల సమస్యతో ఇబ్బందిపడ్డ జోష్ హాజిల్‌వుడ్ మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అబాట్ దూరమవడంతో ఆ జట్టు పెర్త్‌లో స్కాట్ బొలాండ్‌ను ఆడించనుంది.