e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News KL Rahul: బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్‌.. రాహుల్ సెంచ‌రీపై సునీల్‌శెట్టి

KL Rahul: బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్‌.. రాహుల్ సెంచ‌రీపై సునీల్‌శెట్టి

న్యూఢిల్లీ: ఇండియ‌న్ టీమ్ ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ ( KL Rahul ) ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసిన సంగ‌తి తెలుసు క‌దా. అది కూడా ప్ర‌తిష్టాత్మ‌క లార్డ్స్ గ్రౌండ్‌లో సెంచ‌రీ చేయ‌డం దీనిని మరింత ప్ర‌త్యేకంగా మార్చింది. ఇంగ్లండ్‌లో రాహుల్‌కు ఇది రెండో సెంచ‌రీ కాగా.. లార్డ్స్‌లో తొలి సెంచ‌రీ. ఇప్పుడీ సెంచ‌రీపై అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ అతియా శెట్టి, ఆమె తండ్రి, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అత‌డు మూడంకెల స్కోరు అందుకోగానే.. ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. క్రికెట్ మ‌క్కాలో 100. కంగ్రాచులేష‌న్స్‌, గాడ్ బ్లెస్ బాబా. నాకు బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని సునీల్ శెట్టి కామెంట్ చేశాడు.

అటు అతియా శెట్టి కూడా రాహుల్ సెంచ‌రీపై పోస్ట్ చేసింది. కేఎల్ రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎరుపు రంగు హార్ట్ ఐకాన్‌ను ఆమె పోస్ట్ చేయ‌డం విశేషం. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ కోసం రాహుల్ ఇంగ్లండ్ వెళ్లినప్పుడు అత‌ని వెంట అతియా వెళ్లింది. అతియాను త‌న పార్ట్‌న‌ర్‌గా రాహుల్ బీసీసీఐకి చెప్పడం విశేషం. ఈ ఇద్ద‌రూ రెండేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. పిల్ల‌లు ఆనందంగా ఉంటే చాలు అంటూ గ‌తంలోనే సునీల్ శెట్టి దంపతులు కూడా వీళ్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement