మైసూర్: ఐటీఎఫ్ మైసూర్ ఓపెన్‌లో రాష్ట్ర యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో రష్మిక 6-2, 6-3తో ఆకాంక్ష నిట్టూరుపై అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన రష్మిక..ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మిగతా మ్యాచ్‌ల్లో రియా భాటియా 0-6, 6-3, 7-5తో స్మృతి బాసిన్‌పై, జెస్సీ అనె 6-4, 6-0తో పూన ఇంగ్లేపై, లక్ష్మిప్రభ 6-4, 2-1తో ఎలెనాపై గెలిచి ముందంజ వేశారు.