PKL | నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జోరు కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో హర్యానాను కంగుతినిపించిన టైటాన్స్.. బుధవారం మాజీ చాంపియన్ యూ ముంబాను ఓడించింది. నోయిడాలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 31-29తో యూ ముంబాపై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.
పీకేఎల్-11లో ఆడిన 11 మ్యాచ్‌లలో టైటాన్స్‌కు ఇది ఏడో విజయం. టైటాన్స్ తరఫున అశిష్ (8), సాగర్ (4), అజిత్ (4) రాణించారు.