హైదరాబాద్, ఆట ప్రతినిధి: డెహ్రాడూన్(ఉత్తరాఖండ్) వేదికగా జరిగిన 20వ జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. టోర్నీలో ఏడు స్వర్ణాలతో మహారాష్ర్ట అగ్రస్థానంలో నిలువగా, ఐదు స్వర్ణాలతో తెలంగాణ ఆ తర్వాత స్థానం దక్కించుకోగా, కర్ణాటకకు 4 స్వర్ణాలు లభించాయి.
టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వేర్వేరు విభాగాల్లో తెలంగాణ తరఫున నయన శ్రీ(మూడు స్వర్ణాలు), సంసతారెడ్డి(రెండు స్వర్ణాలు), సుహాన్(కాంస్యం), చాణస్య(రజతం, కాంస్యం), ధృవిక(రెండు రజతాలు), అన్విత్(రెండు రజతాలు), మహన్యరెడ్డి(కాంస్యం), ఆరుశ్(కాంస్యం), ప్రణవ్మాధవ్(రజతం, కాంస్యం) రాణించారు. పురుషుల 500మీటర్ల రేసును 45.60 సెకన్లలో పూర్తి చేసిన ప్రణవ్..భారత రెండో ఫాస్టెస్ట్ స్కేటర్గా నిలిచాడు.