హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. ఫ్రాన్స్‌లోని మెనూయిర్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక మెనూయిర్స్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు.
చివరి, తొమ్మిదో రౌండ్లో నల్లపావులతో ఆడిన తెలంగాణ కుర్రాడు తన కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ లగార్డే మాక్సిమ్‌పై సంచలన విజయం సాధించాడు. మొత్తం 9 రౌండ్లలో 5 విజయాలు, 4 డ్రాలతో 7.0 పా యింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన జీఎం రోహిత్ కృష్ణ కూడా ఏడు పా యింట్లు నెగ్గడంతోవిజేతను తేల్చేందుకు టై బ్రేక్‌ను లెక్కించారు. రోహిత్ కృష్ణ మెరుగైన టై బ్రేక్ స్కోరు (43) ఆధారంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, రిత్విక్ (41.5) రజతం అందుకున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన జీఎం ఒమేల్జా ఆర్టెమ్ 6.5 పాయింట్లతో కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు.