హైదరాబాద్, ఆట ప్రతినిధి నవంబర్ 4: జాతీయ మహిళల మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారిణి రేచల్ చటర్జీ స్వర్ణ పతకం సొంతం చేసకున్నారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో శుక్రవారం జరిగిన 1500 మీటర్లను రేచల్ చటర్టీ 8 నిమిషాల 50. 7 సెకన్లలో పరుగు పూర్తి చేసి బంగారు పతకం చేజిక్కించుకున్నారు.
తమిళనాడు చెందిన జ్యోతి, ధనలక్ష్మి వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ చాంపియన్‌షిప్‌ను వరల్డ్ మాస్టర్స్ మహిళల అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విల్మా పెర్కిన్స్, తెలంగాణ మహిళల మాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి బికాస్ కరార్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వి.రవి కుమార్, బాబురావు, నరేందర్ రెడ్డి, మల్లెల బాలరామ్, జేవియర్, విజయ, రమా తదితరులు పాల్గొన్నారు.