National School Games | హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాంచీ(జార్ఖండ్) వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్గేమ్స్లో తెలంగాణ యువ సైక్లిస్టులు సత్తాచాటారు. జాతీయ స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బాలుర అండర్-19 టీమ్ స్ప్రింట్ ఈవెంట్లో అభిశ్రయ్రెడ్డి, సింహాచలం, వర్షిత్, సాత్విక్తో కూడిన తెలంగాణ సైక్లింగ్ టీమ్ 1.20.055సెకన్ల టైమింగ్తో కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది.
ఇదే విభాగంలో రాజస్థాన్, మహారాష్ట్ర వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నాయి. మరోవైపు బాలుర అండర్-17 టీమ్ స్ప్రింట్ ఈవెంట్లో తనిష్క్, సాత్విక్, సాయిచరణ్తో కూడిన రాష్ట్ర టీమ్ (1.13.274సె) మరో కాంస్య పతకం దక్కించుకుంది.