న్యూఢిల్లీ: జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ షూటర్ రావూరి సురభి భరద్వాజ్ కాంస్య పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 50మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో బరిలోకి దిగిన సురభి 620 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఇదే విభాగంలో పోటీపడ్డ మాన్ని కౌశిక్ (626), సిఫ్ట్కౌర్ సమ్రా(622) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఇదే టోర్నీలో రాష్ర్టానికి చెందిన దవళిక దేవి జూనియర్ విభాగంలో పతకం సాధించింది.