అల్మాటీ(కజకిస్థాన్): ప్రతిష్ఠాత్మక ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి అదరగొడుతున్నాడు. తన సూపర్‌ఫామ్ కొనసాగిస్తూ 4.5 పాయింట్లతో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్, వ్లాదిమిర్ ఫెదోసీవ్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సోమవారం ఆరంభమైన ఈ మెగా టోర్నీలో అర్జున్ అయిదు రౌండ్లలో నాలుగు గేమ్‌లలో విజయాలు సాధించాడు. మరోవైపు మహిళల విభాగంలో తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మరో నలుగురితో కలిసి 3.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నది.